organ donation in Karimnagar : చేతికొందొచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచాన పడ్డాడు. పరిస్థితి చేయి దాటి బ్రెయిన్ డెడ్ అయి నిర్జీవంగా పడి ఉన్న కొడుకును చూసి ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. పుట్టెడు దుఃఖంలోనూ వారు తమ ఉదార గుణాన్ని చాటుకున్నారు. తమ కుమారుడి అవయవాలను దానం చేసి.. అతనికి పునర్జన్మనివ్వడమే కాకుండా.. ఎంతో మంది ప్రాణాలు కాపాడటానికి ముందుకొచ్చారు.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రంగశాయిపల్లి చెందిన యువకుడు గంగసాని శ్రీనివాస్ రెడ్డి(26) ఈ నెల 6న స్వగ్రామంలో బైక్ పై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతణ్ని సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స జరిపించారు. కానీ తలకు బలమైన గాయం కావడంతో బ్రెయిన్ డెడ్ గా వైద్యులు తెలిపారు. తీవ్ర విషాదంలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు అంగీకరించారు. ఆసుపత్రి సిబ్బంది తుది లాంఛనాలు పూర్తి చేసి యువకుని మృతదేహాన్ని వారికి అప్పగించారు. అనంతరం స్వగ్రామానికి తీసుకువెళ్లి అంత్యక్రియలు జరిపారు.
ఇదీ చదవండి : Poor Farmer Cultivation: కాడెద్దుగా తాత.. అరకతో మనవడు.