కరీంనగర్ జిల్లా ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం అసువులు బాసిన అమర వీరులకు మౌనం పాటించి నివాళులర్పించారు. ఇవన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనని ఆరోపించారు. సీఎం మొండి వైఖరిని విడనాడి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. బస్టాండ్ ఆవరణలో ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం వల్ల బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.
ఇదీ చూడండి: నిరసనలో ఆర్టీసీ కార్మికునికి అస్వస్థత...