కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం చింతగుట్టలో మంచినీటిని సరఫరా చేయాలంటూ మహిళలు బిందెలతో ఆందోళనకు దిగారు. గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. నీళ్లిచ్చేంత వరకు గ్రామ పంచాయతీ నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకొని కూర్చొన్నారు. గత కొంతకాలంగా మంచినీరు సక్రమంగా సరఫరా చేయట్లేదని ఆరోపించారు.
మండుటెండలో నీటి కోసం సమీప బావుల వద్దకు వెళ్తున్నట్లు వివరించారు. తాగునీరు సక్రమంగా సరఫరా చేయకపోవటం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పంచాయతీ పాలకవర్గానికి చెప్పినప్పటికీ కనీస స్పందన కూడ లేదని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సక్రమంగా తాగునీరును సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
ఇవీ చూడండి: 'వానాకాలంలో పంట మార్పడి చేద్దాం.. యాసంగిలో మక్కలు వేద్దాం'