ETV Bharat / state

మహిళా "మణులు".. స్వచ్ఛతకు సారథులు

ఉపాధి కాస్తా.. ఆసక్తి పెంచింది.. పని చేస్తున్న రంగంలోనే రాణించేందుకు నైపుణ్యం పెంచుకున్నారు. ఆటో డ్రైవర్లు అంటే మగాళ్లేనా.. తాము కూడా నడపుతామంటూ ధైర్యంగా ముందడుగు వేశారు. కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో స్వచ్ఛ ఆటోలకు చోదకులుగా మారి చెత్తను తరలిస్తున్నారు. మహిళల నిర్ణయాన్ని పలువురు అభినందిస్తూ ప్రోత్సహిస్తున్నారు.

womens can driving kwacha autos in Karimnagar municipality
స్వచ్ఛతకు సారథులుగా నిలుస్తున్న మహిళలు
author img

By

Published : Jan 5, 2021, 12:38 PM IST

కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పనుల నిర్వహణలో భాగంగా ప్రతిరోజు 60డివిజన్ల నుంచి చెత్తను సేకరిస్తున్నారు. ఒకటి, రెండు చోట్ల తప్ప మిగతా అన్ని డివిజన్లలో చెత్త సేకరణ కోసం స్వచ్ఛ ఆటోలను ప్రవేశ పెట్టారు. ఎంపిక చేసిన కార్మికులు ఆయా డివిజన్‌లలో చెత్త సేకరణ చేపడుతున్నారు. ఎక్కువ శాతం భర్త ఆటో నడిపిస్తే.. భార్య సహాయకులుగా ఉండి ఇంటింటా చెత్తను తీసుకుంటారు. ఇలా నగరంలో ప్రతిరోజు తడి, పొడి చెత్త సేకరణ జరుగుతుండగా..కొన్ని డివిజన్లలో మహిళలే స్వచ్ఛ ఆటోలకు డ్రైవర్లుగా పని చేస్తూ చెత్తను డంపింగ్‌యార్డుకు తీసుకొని వెళ్తు గుర్తింపు పొందుతున్నారు.

స్వచ్ఛ ఆటోలు నడుపుతున్న మహిళా కార్మికులు
జీవనోపాధి కోసం చెత్త సేకరణ వైపు కార్మికులు ఆసక్తి చూపుతున్నారు. కొందరికి స్వచ్ఛ ఆటోలు ఇవ్వగా మరికొందరు సొంతంగా ఆటోలు ఏర్పాటు చేసుకున్నారు. వీరికి నగరపాలిక తరఫున ఎలాంటి జీత, భత్యాలు, ఇంధనం ఖర్చులు ఇవ్వదు. ఆటోకు 500ఇళ్లను కేటాయించి ప్రతినెలా రూ.50వసూలు చేసుకునేలా చర్యలు చేపట్టింది. అదనంగా పొడి చెత్తను కొనుగోలు చేసేందుకు నగరపాలిక డీఆర్‌సీసీ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ప్రతి స్వచ్ఛ ఆటో కార్మికుడు పొడి చెత్తలో పనికి రాని వస్తువులు అమ్ముకొని రూ.300సంపాదిస్తున్నారు.

40మందిలో.. ఆరుగురిలో ప్రత్యేకం
స్వచ్ఛ ఆటోల ద్వారా చెత్త సేకరణ చేస్తుండగా ఇందులో సుమారు 40మంది మహిళలు సహాయకులుగా పని చేస్తున్నారు. ఆరుగురు మహిళలు మాత్రం ఒక అడుగు ముందుకు వేశారు. వీరు ప్రతిరోజు భర్తలతో పాటు చెత్త సేకరణ చేస్తూ మూడు, నాలుగు చక్రాల ఆటోలను నడిపించడం నేర్చుకున్నారు. గత ఏడాది నుంచి సొంతంగా ఆటోలు నడిపిస్తూ చెత్తను సేకరిస్తున్నారు. ఉదయం 5గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కేటాయించిన ఇళ్ల నుంచి చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నారు.

ఏడాది నుంచి నడిపిస్తున్నా
- వాణి, స్వచ్ఛ ఆటో మహిళా డ్రైవర్‌, కార్మికురాలు
50వ డివిజన్‌లో భర్తతో కలిసి చెత్త సేకరణ చేశాను. డివిజన్‌లో రెండు ఆటోలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో భర్త సహకారంతో నేర్చుకున్నాను. లైర్నింగ్‌ లైసెన్స్‌ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఏడాది నుంచి ఆటో నడిపిస్తూ ఉపాధి పొందుతున్నాను. రుణం ఇప్పిస్తే మరింత ముందుకు వెళ్తాను.

సొంతంగా ఆటో కొనుగోలు
- సమ్మక్క, స్వచ్ఛ ఆటో మహిళా డ్రైవర్‌, కార్మికురాలు
సొంతంగా ఆటోను రుణంపై తీసుకొని ఉపాధి పొందుతున్నాను. గత ఏనిమిది నెలలుగా ఆటో నడిపిస్తున్నాను. ఇంతకుముందు నగరంలో నడిపించగా ప్రస్తుతం అలుగునూర్‌లో ఆటో నడుపుతూ చెత్త సేకరణ చేస్తున్నాను. లెర్నింగ్‌ లైసెన్స్‌ తీసుకున్నాను.

శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తాం
- క్రాంతి వల్లూరు, కమిషనర్‌, కరీంనగర్‌ నగరపాలిక
మహిళా డ్రైవర్లుగా రాణిస్తున్న వారిని గుర్తించి ప్రోత్సహిస్తున్నాం. ఆర్టీసీ సంస్థ ద్వారా చిన్న, భారీ వాహనాలు నడిపిస్తున్న వారికి శిక్షణ ఇవ్వాలని లేఖ రాశాం. స్వచ్ఛ ఆటో మహిళా డ్రైవర్‌కు షీ బస్సు నడిపించేలా శిక్షణ ఇవ్వాలని కోరాం. స్వచ్ఛ ఆటోలో పని చేస్తున్న మహిళా డ్రైవర్లకు ప్రాధాన్యం ఇస్తాం.

వెను వెంటనే కొనుగోలు
- భాగ్యవతి, డీఆర్‌సీసీ నిర్వహకురాలు
డంపింగ్‌యార్డుకు తీసుకొచ్చిన పొడి చెత్తలో అమ్ముకోవడానికి వచ్చే వస్తువులను వెను వెంటనే కొనుగోలు చేయడం జరుగుతుంది. వీరు తీసుకొచ్చిన చెత్తను విక్రయించడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగు పడుతున్నాయి.

ఇదీ చదవండి: కేటీఆర్‌ను సీఎం చేసే ఉద్దేశం కేసీఆర్‌కు లేదు : బండి సంజయ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.