కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం ఊటూరుకు చెందిన శ్రీనివాస్ తన భూమిని సర్వే చేసి ఇవ్వాలని మానకొండూరు రెవెన్యూ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన భూమిలో 18 గుంటలు తక్కువ వస్తోందని భూమి కొలతల కార్యాలయంలోనూ ఫిర్యాదు చేశారు. సర్వేకు వచ్చిన అధికారికి రూ.20 వేల లంచమూ ఇచ్చారు. 3 నెలలు గడుస్తున్నా... సమస్య పరిష్కారం కావట్లేదని కలెక్టర్‌కి గోడు వెళ్లబోసుకునేందుకు కలెక్టరేట్‌కి వెళ్లింది. కానీ అక్కడి అధికారులు ఉదయం వచ్చిన మీనాను సాయంత్రమైన కలెక్టర్‌ను కలవనివ్వలేదు. ఆఖరికి ఓ అధికారికి తన బాధ చెప్పుకోగా.."మీ ఇష్టం వచ్చిన వాళ్ల దగ్గర చెప్పుకోండి" అంటూ నిర్లక్ష్య సమాధానం చెప్పిందని మీనా ఆవేదన వ్యక్తం చేసింది.
ఇవీచూడండి: స్వరూపం మార్చుకోనున్న ప్రజారవాణా