ETV Bharat / state

యుద్ధతంత్ర నయా మంత్ర - LADYS

వాళ్లు మహిళలు... ఎదుట ఉన్న వారు ఎంతవారైనా లెక్కచేయరు... కత్తులతో వచ్చినా... తుపాకులతో వచ్చినా... ఒంటరిగా నైనా .. గుంపుగా వచ్చినా చితక్కొట్టేస్తారు. ఒంటి చేత్తో మట్టి కరిపించి... జైలుకు పంపిస్తామంటున్నారు. వీరంతా ఎవరో కాదు  కరీంనగర్​లో కమెండో శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకున్న మహిళా పోలీసులు.

యుద్ధతంత్ర నయా మంత్ర
author img

By

Published : Mar 2, 2019, 4:05 PM IST

యుద్ధతంత్ర నయా మంత్ర
కరీంనగర్ జిల్లాలో పురుషులతో పాటు మహిళల ఆందోళనలు పోలీసు సిబ్బందికి సవాల్​గా మారాయి. మహిళా సిబ్బంది కొరతతో ధర్నాలు చేస్తున్న వారిని అదుపు చేయడం కష్టతరంగా మారింది. ఈ క్రమంలో పోలీస్ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి మహిళా పోలీసులకు కఠినమైన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.

ఎంతమందికి శిక్షణనిచ్చారు?

ఇదే రాష్ట్రంలో మొదటి మహిళా పోలీస్‌ కమాండోల బృందం. కేవలం పురుషులకు మాత్రమే ఇచ్చే కఠినమైన ఇజ్రాయిల్ యుద్ధ శిక్షణ క్రావ్‌మగాను... మహిళలకు నేర్పడం దేశంలో ఇదే ప్రధమం. తొలుత 80 మంది సిబ్బందికి శారీరకంగా దృఢంగా ఉండేందుకు 15 రోజుల పాటు అవసరమైన శిక్షణ అందించారు. ఇందులో పాస్ అయిన 43 మంది చురుకైన వారిని ఎంపిక చేసి నెల రోజుల పాటు క్రావ్​మగా నేర్పించారు. ఆయుధం లేకుండా ఉగ్రవాదులను అదుపులోకి తీసుకోవడం, అనుమానాస్పద వ్యక్తులను అరెస్టు చేయడంలో తర్ఫీదు పొందారు. శిక్షణ అనంతరం... ఈ విద్యలో పురుషులు మాత్రమే కాదు తాము రాటుదేలామని చెబుతున్నారు ఈ మహిళా కమెండోలు.

ధ్రువీకరణ పత్రాలు అందజేత

శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న సిబ్బందిని సీపీ కమలాసన్ రెడ్డి అభినందించారు. ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. శిక్షణ వల్ల మహిళా సిబ్బందిలో ఆత్మస్థైర్యం మరింత పెరిగిందని సీపీ తెలిపారు.

మరింత మందికి శిక్షణనిచ్చే అవకాశం

తొలి విడతలో 43 మందినే ఎంపిక చేసినప్పటికీ ఆసక్తి కలవారు ముందుకు వస్తే మరికొంత మందికి ఇలాంటి శిక్షణ ఇవ్వడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు అధికారులు వివరించారు.

ఇవీ చదవండి:ఎవరి దమ్ము ఎంత?

పాక్​ కవ్వింపు చర్యలు

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.