కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కోట్ల నరసింహులపల్లి గ్రామానికి చెందిన మమత అనే యువతి ప్రేమ పేరుతో మోసపోయానని మౌనదీక్ష చేస్తోంది. పత్తికుంటపల్లి గ్రామ యువకుడు చంద్రమౌళి గత ఐదేళ్లుగా ప్రేమించి పెళ్లికి నిరాకరించాడని యువతి చెబుతోంది. కొన్ని రోజుల క్రితం ఇరుపక్షాల పెద్దలు నిశ్చితార్థం చేశారు. ఇప్పుడు సొంత గ్రామం నుంచే ఉడాయించాడని అతని ఇంటి ముందు గత రెండు రోజులుగా మౌన దీక్ష చేపట్టింది. తనకు న్యాయం చేయాలని కోరుతోంది.
ఇదీ చూడండి : ప్రేమ పెళ్లి.. 10 రోజులకే వివాహిత అనుమానాస్పద మృతి