కరీంనగర్ జిల్లా రామడుగు మండలం అడ్డరోడ్డు వద్ద దారుణం జరిగింది. రామగళ్ళ అమల అనే మహిళ హత్యకు గురైంది. సిద్దిపేట సమీపంలోని పుల్లూరుకు చెందిన అమల తన భర్తతో విడాకులు తీసుకుని గత రెండు నెలలుగా బిర్యానీ సెంటర్ నడుపుతూ నివసిస్తోంది. ఆదివారం రాత్రి ద్విచక్ర వాహనంపై వచ్చిన ముగ్గురు గుర్తతెలియని వ్యక్తులు ఆమె గొంతుకోసి హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. గ్రామీణ ఎసీపీ ఉషారాణి ఘటనాస్థలికి పరిశీలించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.
ఇదీ చూడండి : బడ్జెట్ సమావేశాలకు అసెంబ్లీ ముస్తాబు