కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లిలో దారుణం జరిగింది. రెండురోజుల క్రితం కుటుంబ సభ్యులకు పాయసంలో విషం కలిపి పెట్టిందో మహిళ. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భర్త అంజయ్య, మామ రాజేశం, కుమారుడు, కుమార్తెకు ఉమ పాయసంలో విషం పెట్టి వడ్డించింది. నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కుమార్తె మన్విత (4) పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధంతో ఇటివలే ఉమ మరొకరితో వెళ్లిపోయి వచ్చినట్లు సమాచారం.
దారుణం... భర్త, మామ, పిల్లలపై భార్య హత్యాయత్నం
10:04 November 30