కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామంలో 3 రోజుల క్రితం భూ తగాదాలతో సొంత పెద్దనాన్న గిద్దె వీరస్వామిపై (46), గిద్దె అజయ్ కర్రతో దాడి చేయడం వల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.
మృతదేహంతో అజయ్ ఇంటి ముందు ధర్నా చేసేందుకు కుటుంబ సభ్యులు యత్నించారు. దీనితో కొద్దిసేపు గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరుకు విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని బాధిత కుటుంబానికి, అక్కడే ఉన్న గ్రామస్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేయడం వల్ల వాగ్వాదం చోటుచేసుకుంది.
చివరకు మృతుడి కుటుంబానికి తగిన నష్టపరిహారం ఇప్పిస్తామని పోలీసులు హామీ ఇవ్వడం వల్ల మృతుడి బంధువులు ఆందోళన విరమించారు.
ఇవీ చూడండి: 'రాష్ట్రంలో సకలం స్వీయ నిర్బంధం'