ETV Bharat / state

ఆ గ్రామంలో ఈత కల్లు పోతోంది... దొంగలెవరు...? - టేకుర్తి గ్రామంలో కల్లు దొంగతనం

ఆ గ్రామంలో ఈత కల్లు పోతోంది. రోజు విడిచి రోజు ఈ తంతు జరుగుతోంది. అసలు ఇలా చేస్తోంది ఎవరని తెలుసుకునేందుకు ఎంత ప్రయత్నించినా దొరకట్లేదు. ఈత కల్లు దొంగ కోసం ఆ గ్రామ గీత కార్మికులు చలిని సైతం లెక్కచేయకుండా రాత్రుళ్లు కాపు కాస్తున్నారు.

ఆ గ్రామంలో ఈత కల్లు పోతోంది... దొంగలెవరు...?

author img

By

Published : Nov 12, 2020, 5:07 PM IST

ఆ గ్రామంలో ఈత కల్లు పోతోంది... దొంగలెవరు...?

కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలంలోని టేకుర్తిలో ఈత కల్లు పోతోంది. కల్లు పోవడమేంటీ అని ఆశ్చర్యపడుతున్నారా..? నిజమండీ... గ్రామంలోని గౌడ సంఘంలో నిర్ణయించిన రుసుము చెల్లించి పలువురు గీత కార్మికులు... ఈత చెట్లు తీసుకుని కోయించారు. సీజన్​ కాబట్టి కల్లు కూడా బాగానే అవుతోంది.

ఇదే అదునుగా భావించి పలువురు గుర్తుతెలియని వ్యక్తులు కల్లు దొంగతనం చేస్తున్నారు. గమనించిన గీత కార్మికులు... వారిని పట్టుకునేందుకు రాత్రంతా చలిలో కాపు కాశారు. అయినా... తమ కళ్లుగప్పి కల్లును దొంగిలిస్తున్నారని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు మాకు న్యాయం చేయాలని కోరారు. ఒకవేళ తామే పట్టుకుంటే మాత్రం రూ.50 వేల జరిమానా వేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: భర్త ఇంటి ముందు కూతురితో కలసి భార్య ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.