రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారంలో భాగంగా మొక్కలు సంరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు కరీంనగర్ పాలనాధికారి శశంక వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఆరో విడత హరితహారం సందర్భంగా మొక్కలు సిద్ధం చేశామని పేర్కొన్నారు. రాబోయే రెండు వారాల్లో పూర్తిస్థాయిలో మొక్కలు నాటి సంరక్షణ చేపడతామని స్పష్టం చేశారు.
ప్రతి కుటుంబానికి రెండేసి పూల మొక్కలు, రెండు పండ్ల మొక్కలు, మరో రెండు దోమల వ్యాప్తిని అరికట్టే మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. రామడుగు మండలం శ్రీరాములపల్లి, మోతే, వెలిచాల గ్రామాల్లో మొక్కలు నాటి ప్రకృతి వనాల పెంచేందుకు స్థలాల్ని పరిశీలించారు. మూడు గ్రామాల్లోనూ స్థానికులకు మొక్కలు పంపిణీ చేశారు.
ఇవీ చూడండి : కోదండరాం నిరసన దీక్ష.. ప్రజల బతుకులు కాపాడాలని డిమాండ్