ETV Bharat / state

Villages Merged: విలీనం చేసినా తప్పని తిప్పలు.. తాగునీటి కోసం అవస్థలు - విలీన గ్రామాల్లో ఇబ్బందులు

రెండున్నర ఏళ్ల క్రితం శివారు గ్రామాలను కరీంనగర్‌ కార్పొరేషన్‌లో విలీనం చేసినా అదనపు ప్రయోజనాలు అందని ద్రాక్షగానే మిగులుతోంది. పంచాయతీలుగా ఉన్నప్పుడు.. తాగునీటికి నానా ఇబ్బందులు పడిన జనానికి కార్పొరేషన్‌లో కలిసినా కష్టాలు తీరలేదు. నీటి సరఫరాకు చెందిన పనులు నత్తనడకన సాగడంతో విలీన కాలనీల్లో నీటి చుక్క లేక ఆ ప్రాంతవాసులు అవస్థలు తప్పడం లేదు.

water problem in Karimnagar merged villages
కరీంనగర్‌ కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాల్లో నీటి కష్టాలు
author img

By

Published : Aug 7, 2021, 5:04 AM IST

Updated : Aug 7, 2021, 6:38 AM IST

కరీంనగర్ కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాల ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. పంచాయతీ బోర్డులు మారినా తాగునీటి కష్టాలు మాత్రం వీడడం లేదు. మరోవైపు మిషన్‌ భగీరథ పనులు నత్తనడకన సాగుతున్నాయి. నగరంలో గ్రామాలు కలిసిన తర్వాత నీటి సరఫరా అరకొరగానే సాగుతోంది.

తప్పని తాగునీటి కష్టాలు

రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన మిషన్‌భగీరథ పథకం కరీంనగర్‌ కార్పొరేషన్‌ విలీన ప్రాంతాల్లో నత్తనడకన సాగుతోంది. రెండున్నరఏళ్ల క్రితం గ్రామాల్ని నగరపాలక సంస్థలో విలీనం చేశారు. ఐతే గ్రామాల్లో బోర్డులు మారడం తప్ప సేవల్లో మాత్రం ఎలాంటి మార్పులేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తన్నారు. అసంపూర్తిగా పైపులైన్లు, ట్యాంకులు నిర్మించినా సాంకేతిక సమస్యలతో పూర్తిస్థాయిలో నీటి సరఫరా జరగట్లేదు. తీగలగుట్టపల్లి, సరస్వతీనగర్‌, హనుమాన్‌నగర్‌, రామాలయం వైపు ఇంటర్‌ కనెక్షన్లు, గేట్‌ వాల్వులు బిగించకపోవడంతో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు.

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో విలీనమైన గ్రామాల్లో నీటి కష్టాలు

తాగునీటి సమస్య ఉంది: మేయర్ సునీల్ రావు

విలీన గ్రామాల్లో తాగునీటి సమస్య వాస్తవమేనని కరీంనగర్ మేయర్ సునీల్‌రావు అంగీకరించారు. అదనంగా కొత్త పైపులైన్లు వేయాల్సి ఉందని పలు ప్రాంతాల్లో ఇంటర్ కనెక్షన్‌ ఇవ్వాల్సి ఉందని ఆయా పనులకు టెండర్లు ఆహ్వానించినట్లు మేయర్ తెలిపారు. ఇప్పటికైనా అధికారులు త్వరగా నిర్మాణాలు పూర్తి చేసి తాగునీరు సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. పనుల్లో వేగం పెంచి సమస్య పరిష్కరిస్తామని సునీల్‌రావు అన్నారు.

ఇదీ చూడండి:

అన్నదాతలకు శుభవార్త... ఈ నెల 16 నుంచి రైతు రుణమాఫీ!

Last Updated : Aug 7, 2021, 6:38 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.