తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలన్ని రాష్ట్రాన్ని సాధించుకుని అధికారంలోకి రాగానే ఒక్కొక్కటిగా అమలు చేశామని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్(Telangana Planning Commission Vice President Vinod Kumar) పునరుద్ఘాటించారు. ప్రజల సంక్షేమం కోసం రాష్ట్రాన్ని సాధించకున్న అనతి కాలంలోనే అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేశారని తెలిపారు. అన్నివర్గాల కోసం అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టారని చెప్పారు.
అలాంటి ప్రజా సంక్షేమ పథకాలను ఓట్ల కోసం రద్దు చేస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించడం సబబు కాదని వినోద్(Telangana Planning Commission Vice President Vinod Kumar) అన్నారు. ఓట్లు వేయకపోతే ఆసరా, వితంతు, ఒంటరి మహిళలు, వికలాంగులకు ఇచ్చే పింఛన్లు రద్దు చేస్తామనడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు ఓట్ల కోసం ప్రవేశపెట్టినవి కావని.. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అమలవుతున్నవి అని స్పష్టం చేశారు.
తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం సాధించుకున్న తర్వాత నీళ్లు తీసుకొస్తామని చెప్పి.. తీసుకొచ్చి చూపించామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్(Telangana Planning Commission Vice President Vinod Kumar) పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజల సంక్షేమానికి తీసుకొచ్చిన పథకాలు ఎందుకు రద్దు చేస్తామని అడిగారు. పథకాలు రద్దు చేస్తామని ఎందుకు ప్రచారం చేస్తున్నారంటూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. ఓట్లు వేయకపోతే పింఛన్లు ఆపేస్తామని అనడం సబబు కాదని అన్నారు.
"కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న కిషన్ రెడ్డి ఆయన స్థాయికి తగ్గట్లు మాట్లాడాలి. ఓట్లు వేయకపోతే పథకాలు రద్దు చేస్తామనడం సబబు కాదు. ఓట్ల కోసం పథకాలు ప్రవేశపెట్టామా. ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ సంక్షేమ పథకాలు ప్రారంభించాం. హుజూరాబాద్‌లో తప్పక గెలుస్తాం.. ఒకవేళ అనివార్య కారణాల వల్ల గెలవకపోయినా.. పథకాలు రద్దు చేయం. ఏవైనా పనికొచ్చే విమర్శలు చేయండి. ఉద్యమ కాలంలో పుట్టిన ఆలోచనలను కేసీఆర్.. అధికారంలోకి రాగానే పథకాలుగా ప్రవేశపెట్టారు. ప్రజాసంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ఎటువంటి పరిస్థితుల్లో రద్దు చేయం."
- వినోద్ కుమార్, తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు