ETV Bharat / state

ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలు తీరుస్తాం: వినోద్ కుమార్ - తెలంగాణలో ప్రైవేట్ టీచర్స్ కష్టాలు

కుడితిలో పడ్డ ఎలుక లాగా తమ పరిస్థితి ఏర్పడిందని ప్రైవేటు ఉపాధ్యాయులు.. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్​కుమార్ ముందు మొరపెట్టుకున్నారు. దీనికి స్పందించిన ఆయన పరిస్థితిని సీఎం కేసీఆర్​కి విన్నవించి సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Private Teachers Problems in Telangana State
బతుకు నేర్పినోళ్ల జీవన పోరాటం!
author img

By

Published : Sep 13, 2020, 8:43 PM IST

కరీంనగర్​ నగరంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ పర్యటించారు. ఈ తరుణంలో ప్రైవేటు ఉపాధ్యాయులు ఆయనను కలిసి తమ పరిస్థితిని మొరపెట్టుకున్నారు. గత ఆరు మాసాలుగా పాఠశాలల యాజమాన్యాలు వేతనాలు ఇవ్వడం లేదని వాపోయారు. దీనివల్ల తమ కుటుంబాల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

స్పందించిన వినోద్ కుమార్ పరిస్థితిని ముఖ్యమంత్రికి విన్నవిస్తానని తెలిపారు. సమస్య పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ కష్టాలు అర్థం చేసుకొని సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అధ్యాపకులకు సరిగ్గా వేతనాలు ఇవ్వని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇవీచూడండి: అరణ్య రోదనగా, ప్రైవేట్ అధ్యాపకుల ఆకలి కేకలు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.