కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సాగునీరు అందించే విధంగా ప్రణాళికలు రూపొందిసున్నట్టు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కాళేశ్వరం ప్రాజెక్ట్ చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు, నీటిపారుదల చీఫ్ ఇంజనీర్ అనిల్ కుమార్ హాజరయ్యారు. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ నియోజకవర్గంలో 53 కిలోమీటర్లు పారుతూ నీటి లభ్యత కలిగి ఉండటం వల్ల చెరువులు నింపేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించారు.
రామడుగు మండలంలో 27వేల ఎకరాల్లో సాగు నీరందించే మోతె రిజర్వాయర్ రద్దు కావటం వల్ల దాని స్థానంలో వరద కాలువకు 4 తూములు నిర్మించే పనులను సత్వరం మొదలు పెట్టాలని నిర్ణయించారు. గంగాధర మండలం నారాయణపూర్ చెరువు నుంచి కుడి కాలువ భూసేకరణ పూర్తి చేసి బోయినపల్లి మండలంలోని అన్ని గ్రామాలకు సాగునీరు అందించాలని చర్చించారు. నియోజవర్గంలోని అన్ని మండలాల్లో ప్రతి అంగుళం సస్యశ్యామలం చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించనున్నట్టు ఎమ్మెల్యే రవిశంకర్ వెల్లడించారు.
ఇవీ చూడండి: కరోనా సమయంలో పదోతరగతి పరీక్షలా..!