వేములవాడలో శివపార్వతుల కల్యాణ వేడుకలు ప్రారంభం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో శివపార్వతుల కల్యాణానికి ముందస్తు ఉత్సవం ప్రారంభమైంది. రేపు జరిగే వివాహ వేడుకకు భారీ ఏర్పాట్లు చేశారు. ఆలయంలో ఐదు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు యాగశాల ప్రవేశం, అర్చకులకు వర్ని అందజేత తదితర కార్యక్రమాలు నిర్వహించారు. గర్భగుడిలో శ్రీరాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు.
ఇదీ చూడండి:ఆరేళ్ల బాలికపై లైంగికదాడి చేసి హత మార్చిన దుండగులు