ఇండోనేషియన్ల రాకతో.. కరీంనగర్లో 13 మందికి కరోనా పాజిటివ్ రావడం, మర్కజ్ వెళ్లి వచ్చిన వారిలో మరో ఆరుగురికి కరోనా అని తేలడం వంటి ఘటనలు చోటు చేసుకున్నందున కరీంనగర్లో అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని పరిస్థితి చక్కదిద్దేందుకు శ్రమించారు. వివిధ ప్రాంతాల నుంచి రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. ఆ క్రమంలో బస్సులు నడపడం కూడా ఆపేశారు. ప్రజలు నిత్యావసరాల కోసం, కూరగాయల కోసం ఇబ్బంది పడకుండా కరీంనగర్ బస్టాండ్‌ను తాత్కాలిక కూరగాయల మార్కెట్‌గా మార్చారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల ప్రజల కోసం 16 తాత్కాలిక కూరగాయల మార్కెట్లు ఏర్పాటు చేశారు. ప్రజలు, రైతులు, కూరగాయల అమ్మకందారులు భౌతిక దూరం పాటించేలా విశామైన ప్రాంతంలో కూరగాయల మార్కెట్ సిద్ధం చేశారు.
తాజాగా లాక్డౌన్ కాస్త సడలించి.. కొన్ని నిర్ణీత ప్రాంతాలకు బస్సులు నడపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అధికారులు కరీంనగర్ బస్టాండ్‌లో ఉన్న మార్కెట్‌ను పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు మార్కెటింగ్ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి అదికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇవీ చూడండి: 'మీ అందరి సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం'