ETV Bharat / state

kishan reddy: "ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు కావాలో... జైకొట్టేవారు కావాలో తేల్చుకోండి" - కేసీఆర్​పై కిషన్​ రెడ్డి విమర్శలు

రాష్ట్రంలో కేసీఆర్​ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు (minister kishan reddy comments on kcr). భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్‌ తరఫున.... సిరిసేడు, రాంపూర్‌, చెల్పూర్‌లో పర్యటించారు. ఎన్నికల్లో ఈటలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నియంతృత్వాన్ని ప్రశ్నించినందుకే ఈటలను బయటకు పంపారన్న కిషన్‌రెడ్డి..... శాసనసభలో ప్రజాగొంతుక వినిపించే నాయకుడిని ఎన్నకోవాలని సూచించారు.

kishan reddy
kishan reddy
author img

By

Published : Oct 25, 2021, 7:29 PM IST

తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంతో మంది ప్రాణత్యాగాలు చేస్తే ఫలితాలు మాత్రం కేసీఆర్ కుటుంబం అనుభవిస్తోందన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు (minister kishan reddy comments on kcr). హుజూరాబాద్​ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా సిరిసేడు, రాంపూర్‌, చెల్పూర్ గ్రామాల్లో పర్యటించారు (union minister kishan reddy campaign in huzurabad ). భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్​ తరఫున ప్రచారం నిర్వహించారు.

నియంతృత్వాన్ని ప్రశ్నించినందుకే..

రాష్ట్రం వస్తే బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్​... గెలవగానే సీఎం కుర్చీ మీద కూర్చొని నిజాం తరహా పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పి తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకున్నారన్నారన్నారు. నియంతృత్వాన్ని ప్రశ్నించినందుకే ఈటలను పార్టీ నుంచి గెంటేశారని ఆరోపించారు. ఈటల రాజేందర్​ భాజపాలో చేరకుంటే ఎన్నికల్లో కూడా పోటీ చేయనిచ్చేవారు కాదని పేర్కొన్నారు. భాజపా అభ్యర్థిగా బరిలోకి దిగిన ఈటల వెనుక ప్రధాని మోదీ ఉన్నారన్నారు.

ఆ రెండు కుటుంబాలే రాష్ట్రాన్ని శాసిస్తున్నాయి

కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొట్టే రోజు త్వరలో వస్తుందని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి పేర్కొన్నారు (minister kishan reddy comments on kcr). కల్వకుంట్ల, ఒవైసీ కుటుంబాలు తెలంగాణను శాసిస్తున్నాయని ఆరోపించారు (union minister kishan reddy campaign). శాసనసభలో గొంతెత్తే నాయకుడు కావాలా..? కేసీఆర్ కుటుంబానికి జై కొట్టే వారు కావాలా..? ఆలోచించుకోవాలని కిషన్‌రెడ్డి సూచించారు.

ఈటల రాజేందర్... కేసీఆర్​ కుటుంబ పెత్తనాన్ని ప్రశ్నించాడని, పాలనను సవాలు చేశాడని ఆయనను అనేక రకాలుగా వేధిస్తున్నారు. ఈటల రాజేందర్​ రాజకీయ భవిష్యత్తును అన్యాయం చేయాలని కేసీఆర్​ కుటుంబ కంకణం కట్టుకుంది. రాత్రికి రాత్రి ఈటల రాజేందర్​ను మంత్రి పదవి నుంచి తీసేశారు. రాత్రికి రాత్రి ఈటల రాజేందర్​పై దర్యాప్తులు చేపట్టారు. నా నాయకత్వాన్ని సవాలు చేస్తావా..? మా కుటుంబాన్ని సవాలు చేస్తావా..? ఉంటే నా కుటుంబం కాళ్ల దగ్గర పడుండు... లేకపోతే నువ్వు ఉండడానికి వీళ్లేదనిచెప్పి ఈటల రాజేందర్​ను అవమానించారు. భాజపాలో చేరకుంటే ఈటల రాజేందర్​ను ఎన్నికల్లో కూడా పోటీ చేయనిచ్చేవారు కాదు. జైళ్లో పెట్టేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా ఈటల రాజేందర్​ వెనుక ఉంది. ఈటల రాజేందర్​ ఒక్కడు కాదు.. ఈరోజు.. దేశ ప్రధాన మంత్రే ఈటల రాజేందర్​ వెనుక ఉన్నారు. -కిషన్​ రెడ్డి, కేంద్ర మంత్రి

"ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారు కావాలో... జైకొట్టేవారు కావాలో తేల్చుకోండి"

ఇదీ చూడండి: 6th Day Sharmila Padayatra: ప్రభుత్వ కొలువులొచ్చాయా.. పింఛన్లు అందుతున్నాయా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.