కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం అర్నకొండలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మారం మండలం మల్లాపూర్‌కు చెందిన కమలేష్, సాగర్ అనే యువకులు ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో రహదారిపై ఉన్న గుంతను తప్పించబోయి ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు తీవ్ర గాయాలపాటు కాగా... ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : సంక్షేమ బోర్డు.. సరకుల రవాణా.. బస్సుల తగ్గింపు!