ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె ఉద్ధృతమవుతోంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బస్ డిపోల ముందు కార్మికులు ధర్నా చేస్తూ... బస్సులను బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసి వేర్వేరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా... ప్రభుత్వం కార్మికుల పట్ల నియంతృత్వ ధోరణిలో వ్యవహరిస్తోందని ఆర్టీసీ ఉద్యోగులు మండిపడ్డారు.
ఇవీ చూడండి: పెళ్లింట విషాదం... రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకు మృతి