బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇంటిని ముట్టడించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ముట్టడించేందుకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను మధ్యలోనే అడ్డుకొనేందుకు పోలీసులు యత్నించారు. దీనితో అక్కడ కాసేపు తోపులాట చోటు చేసుకొంది.
ప్రభుత్వం వెంటనే ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇంటి ముట్టడికి వస్తున్న నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇవీ చూడండి:ఎంఎంటీఎస్ ప్రమాదంలో 12కు చేరిన క్షతగాత్రుల సంఖ్య