తమ సమస్యలు పరిష్కరించాలంటూ కరీంనగర్లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 43వ రోజుకు చేరుకుంది. ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నా సర్కారు స్పందించకపోవడం వల్ల కార్మికులు ఆందోళన బాటపట్టారు. కరీంనగర్ బస్టాండ్ ముందు కార్మికులు, తెదేపా, కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. డిపోలోంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆందోళనకారులను, ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి స్థానిక స్టేషన్కు తరలించారు.
ఇదీ చదవండిః ఆర్టీసీ ఐకాస తగ్గినా.. ప్రభుత్వ స్పందన లేదు..?