కరీంనగర్లో ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర బంద్ ప్రశాంతంగా సాగింది. ఉదయం నుంచే బస్సులు డిపోలకు పరిమితమయ్యాయి. మధ్యాహ్నం రెండు గంటల వరకు కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో వివిధ పార్టీల నాయకులు ఆర్టీసీ కార్మికులు నిరసన దీక్షలు చేపట్టారు. భాజపా, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఇతర జిల్లాల నుంచి వస్తున్న బస్సులను ఆర్టీసీ కార్మికులు అడ్డుకోగా... పోలీసుల ఎస్కార్ట్‌లతో బస్టాండ్‌కు తరలించారు. కరీంనగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఇతర డిపోల నుంచి బస్సులు నడుస్తుండగా... మొదటి, రెండవ డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు.
ఇదీ చూడండి: వేదికపై ర్యాంప్‌వాక్ చేస్తూ విద్యార్థిని మృతి!