ETV Bharat / state

FRIENDSHIP: కరోనా కాలం.. స్నేహ వికాసం - telangana news

‘స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం’..అనేలా మైత్రి బంధం అన్ని కాలాల్లో మరిచిపోలేని మధురానుభూతిగానే మారుతోంది. ఇటీవల కరోనా మహమ్మారి బంధాల్ని బలి తీసుకునే కాలంలో స్నేహం విలువ అసలైన అభిమతాన్ని చేతల్లో చాటింది. అతలాకుతలమనే పరిస్థితుల్లో ఆత్మీయత ఒరవడిని చూపింది.

true-friends-are-their-for-u-in-bad-times-also
FRIENDSHIP: కరోనా కాలం.. స్నేహ వికాసం
author img

By

Published : Aug 1, 2021, 7:40 AM IST

మాయదారి కరోనా రోగం మనషుల్ని దూరం చేసిన తరుణంలో అసలైన మనస్సుతో స్పందించిన స్నేహ వికాసం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పరిమళించింది. నేడు ‘స్నేహితుల దినోత్సవం’ సందర్భంగా జిల్లాలోనే పలువురు స్నేహితుల స్ఫూర్తిదాయక చొరవపై కథనాలు..

మిత్రుల సేవా నేత్రం... - పెద్దపల్లి

స్నేహితులతో నేత్ర (కుడివొైపు వ్యక్తి)

కరోనా బారిన పడిన మిత్రుడిని కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించారు. కుటుంబ సభ్యులకు మించి సపర్యలు చేశారు. పరిస్థితి విషమించి దూరమైన అతడి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెద్దపల్లికి చెందిన బరిగల నేత్ర(31) గత ఏప్రిల్‌లో కరోనా బారిన పడ్డారు. 18 రోజుల పాటు హోం క్వారంటైన్‌లోనే చికిత్స పొందినా ఆరోగ్యం కుదుటపడలేదు. పరిస్థితి విషమించడంతో నేత్రతో కలిసి 2005-06లో పదో తరగతి చదువుకున్న టి.అభినవ్‌, రాపెల్లి శ్రీనివాస్‌, కలహాల అన్వేష్‌ కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యం కోసం రూ.50 వేల వరకు వెచ్చించారు. అయినా ఫలితం లేకపోవడంతో నేత్ర మే 24న మృతి చెందారు. స్నేహితులు అతడి కుటుంబానికి ఆర్థిక సాయం అందించేందుకు ముందుకొచ్చినా కుటుంబ సభ్యులు సున్నితంగా తిరస్కరించారు. దీంతో నేత్రతో తమ జ్ఞాపకాన్ని పదిలం చేసుకునేందుకు మిత్రులు రూ.60 వేలు వెచ్చించి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు, నాణ్యమైన ఆహారాన్ని అందించారు.

సామాజిక సేవలో ‘బాల్యమిత్ర’... - ఎల్లారెడ్డిపేట

సరకులను అందిస్తున్న ఫౌండేషన్‌ సభ్యులు

ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 1994-1995 సంవత్సరం పదో తరగతి పూర్వ విద్యార్థులంతా కలిసి మూడేళ్ల క్రితం బాల్యమిత్ర ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి రూ. 10 వేల నుంచి రూ. 1.60 లక్షల చొప్పున ఇప్పటి వరకు సుమారు రూ. 10 లక్షలను ఆర్థికసాయంగా అందజేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో 200 నిరుపేద కుటుంబాలకు గాను ఒక్కో కుటుంబానికి రూ. 1500 విలువైన నిత్యావసర సరకులు, రూ. 200 నగదు పంపిణీ చేశారు. వివిధ రకాలుగా పలువురికి ఆర్థికసాయం చేశారు. సామాజిక సేవలను మున్ముందు మరింత విస్తృతంగా నిర్వహిస్తామని ఫౌండేషన్‌ అధ్యక్షుడు రాగుల ఎల్లారెడ్డి పేర్కొన్నారు.

రూ.30 లక్షలు వెచ్చించి.. - సుభాష్‌నగర్‌

కన్నం శ్రీనివాస్‌, వెంకటేశ్వర్లు

కరీంనగర్‌ నగరపాలక కార్యాలయంలో పని చేస్తున్న డీఈఈ వెంకటేశ్వర్లు, ఇరిగేషన్‌ శాఖలో పని చేస్తున్న ఏఈఈ కన్నం శ్రీనివాస్‌ స్నేహితులు. రెండో వేవ్‌లో వచ్చిన కరోనా మహమ్మారి ఏఈఈ శ్రీనివాస్‌ను వదల్లేదు. చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రిలో చేరడంతో ఆర్థిక భారం మొదలైంది. డిప్లొమా ఫ్రెండ్స్‌, తోటి సహాద్యోగులు, అధికారులు, బంధువులు కలిసి ఆర్థికంగా ఆదుకున్నారు. కోలుకున్న తర్వాత 10రోజులకే మళ్లీ అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్‌ కార్పొరేట్‌ ఆసుపత్రిలో చేర్పించారు. 15రోజుల పాటు చికిత్స పొంది ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్నారు. మొత్తంగా రూ.30లక్షలు ఖర్చు కాగా స్నేహితులు వెంకటేశ్వర్లు, ఆయన బంధువు మురళీకృష్ణ ముందుండి స్నేహితుల సహకారంతో ఆర్థికంగా ఆసరాగా నిలిచారు.

స్నేహితుని కుటుంబానికి భరోసా.. - కరీంనగర్‌

సాయం అందిస్తున్న పూర్వ విద్యార్థులు

1984-85 సంవత్సరంలో స్థానిక లయోల పాఠశాలలో వారు పదో తరగతి పూర్తి చేసి స్నేహితులు ఎవరి వృత్తిలో వారు జీవితం వెళ్లదీస్తున్నా. అప్పుడప్పుడు కలుస్తుండేవారు. మిత్రబృందంలో ఒకరైన జయప్రకాష్‌ కరోనా మహమ్మారితో మరణించాడు. ఇంటి పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. విషయం తెలిసిన స్నేహితులందరూ తమ బాధను పంచుకోవడంతోనే సరిపెట్టలేదు. తమవంతుగా 3.5 లక్షల రూపాయలను జమ చేసి, మిత్రుని భార్య పిల్లలకు అందజేశారు. అనాటి స్నేహితులు వంగల పవన్‌, ఉప్పుల అంజనీప్రసాద్‌, చంద్రశేఖర్‌రావు, కె.శ్రీనివాస్‌, నారాయణశర్మ, టీవీ రమణారావు, ఈద మధుకర్‌, నరేందర్‌ రావులు.కుటుంబానికి అండగా ఉంటామన్నారు.

చిన్నారులకు చేయూత.. - సెంటినరీకాలనీ

నగదు సాయం అందజేస్తున్న స్నేహితులు

ప్రాణస్నేహితుడితో పాటు ఆయన భార్య సైతం కరోనా మహమ్మారికి బలి కావడం వారిని కదిలించింది. అనాథలుగా మారిన వారి ఇద్దరు పిల్లలకు అండగా నిలిచి సహృదయత చాటుకున్నారు. రామగిరి మండలం బేగంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కుడికాల మల్లేష్‌తో పాటు అదే గ్రామానికి చెందిన పలువురు పదేళ్ల పాటు కలిసి చదువుకున్నారు. మల్లేశ్‌తో పాటు అతని భార్య సృజన రెండు నెలల కిందట కరోనాతో మృతి చెందారు. వారికి ఇద్దరు కుమారులు కాగా తల్లిదండ్రుల మృతితో అనాథలయ్యారు. మల్లేశ్‌తో కలిసి 1999-2000లో పదో తరగతి చదివిన స్నేహితులు రూ.34 వేలు విరాళాలుగా పోగు చేశారు. ఆ మొత్తాన్ని స్నేహితుడి పిల్లలకు అందజేసి చిన్నారులకు బాసటగా నిలిచారు.

ఆపత్కాలంలో అండగా నిలిచి.. - పెద్దపల్లి

రూ.2.31 లక్షల ఎఫ్‌డీ అందజేస్తున్న స్నేహితులు

పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్‌ ఐటీఐ కాలనీకి చెందిన నాగూరి సురేశ్‌(45) హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం చేస్తుండేవారు. కరోనా బారిన పడిన అమ్మానాన్నలకు సపర్యలు చేసేందుకు పెద్దపల్లికి వచ్చిన ఆయన ఈ ఏడాది మే నెలలో వైరస్‌ బారిన పడ్డారు. తల్లిదండ్రులు కొవిడ్‌ నుంచి కోలుకున్నా సురేశ్‌ కరీంనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతడితో కలిసి బసంత్‌నగర్‌ ఇండియన్‌ మిషన్‌ సెకండరీ పాఠశాలలో 1990-91లో పదో తరగతి చదివిన మిత్ర బృందం సురేశ్‌ కుటుంబానికి అండగా నిలిచారు. అందరూ కలిసి రూ.2.31 లక్షలను పోగు చేశారు. మిత్రుడి కూతురు పేరిట ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. అలాగే హైదరాబాద్‌లోని సురేశ్‌ ఇంటిపై మరో అంతస్తు నిర్మించి, వారి కుటుంబానికి శాశ్వత ఆదాయ వనరు ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు మిత్ర బృందం సభ్యులు తెలిపారు.

ఇదీ చూడండి: Friendship Day: మాటలకందని స్నేహ బంధం... ఎంతో మధురం..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.