ETV Bharat / state

ALLEGATIONS ON RASAMAYI: తెరాసకు కరీంపేట సర్పంచ్​ రాజీనామా.. ఎమ్మెల్యే రసమయి వేధిస్తున్నారని ఆరోపణ - తెలంగాణ తాజా వార్తలు

కరీంనగర్​ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేటకు సర్పంచ్​ మల్లయ్య తెరాసకు రాజీనామా చేశారు. ఓ భూ వివాదంలో ఎమ్మెల్యే రసమయి జోక్యం చేసుకుంటున్నారని మల్లయ్య ఆరోపించారు. మానసికంగా వేధించడంతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సర్పంచి మల్లయ్య ప్రకటించారు.

sarpanch allegations on mla rasamayi balakishan

author img

By

Published : Sep 6, 2021, 2:16 PM IST

భూవివాదంలో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ జోక్యం చేసుకుంటున్నారని.... కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కరీంపేట సర్పంచి మల్లయ్య.... తెరాస పార్టీకి రాజీనామా చేశారు. గ్రామంలో పలువురితో తనకు భూవివాదం తలెత్తగా... ఎమ్మెల్యే జోక్యం చేసుకొని ఫోన్‌లో ఇష్టారీతిగా తనను దూషించాడని ఆరోపించారు. మానసికంగా వేధించడంతోనే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సర్పంచి మల్లయ్య ప్రకటించారు. గ్రామంలో పని చేయించేందుకు తన తరఫున జేసీబీ తీసుకొచ్చిన వ్యక్తిని ఎస్సై కొట్టారని మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామానికి సంబంధించిన పనిచేస్తుంటే కొట్టడం సరికాదని... ఈ అంశంపై విచారణ చేపట్టాలని సీఐకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

నన్ను ఇబ్బంది పెడుతున్నారు. పార్టీలో ఉండలేకపోతున్నా. నా ఆస్తిని పంచిపెట్టమంటున్నారు. ఎన్నికల్లో తిరిగినోళ్లకు నా ఆస్తిని ఇవ్వమంటున్నారు. రోడ్డు మీద ఉన్న నా వాహనాన్ని తీసుకెళ్లారు. ఎమ్మెల్యే దౌర్జన్యాన్ని భరించలేకే పార్టీకి రాజీనామా చేస్తున్నా.

- మల్లయ్య, సర్పంచ్‌, కరీంపేట

ALLEGATIONS ON MLA RASAMAYI: తెరాసకు కరీంపేట సర్పంచ్​ రాజీనామా.. ఎమ్మెల్యే రసమయి వేధిస్తున్నారని ఆరోపణ

ఇదీచూడండి: BANDI SANJAY: వంద కి.మీ. పూర్తయిన ప్రజాసంగ్రామ యాత్ర

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.