కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వెలిచాలలో శిక్షణ ఐఏఎస్ అధికారిణులు స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. గ్రామ పరిపాలన వ్యవస్థ గురించి తెలుసుకునేందుకు ఐదు రోజుల క్షేత్ర స్థాయి శిక్షణ కోసం వచ్చిన బృందం వెలిచాలలో బస చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన రూపాలి గుప్తా, దిల్లీకి చెందిన సంజనా కడ్యాన్ బతుకమ్మ వేడుకలో ఉత్సాహంగా ఆడి పాడారు.
ఇవీ చూడండి: రేపు దిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్... ఎల్లుండి ప్రధానితో భేటీ..