'అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే ఈటల భాజపాలో చేరారు' - పాడి కౌశిక్‌రెడ్డి తాజా వార్తలు
రెండు సార్లు మంత్రి పదవిని చేపట్టిన ఈటల రాజేందర్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కౌశిక్‌రెడ్డి ప్రశ్నించారు. తన అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే ఆయన భాజపాలో చేరారని ఆరోపించారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన అక్రమ ఆస్తులను కాపాడుకునేందుకే భాజపాలో చేరారని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఈటల తన పదవికి ఎందుకు రాజీనామా చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
రెండు సార్లు మంత్రి పదవిని చేపట్టిన ఈటల రాజేందర్ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. 2018లోనే ఆయన అక్రమ ఆస్తుల చిట్టాను తాను బయటపెట్టానని గుర్తు చేశారు. రానున్న ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని.. ప్రజలకు సేవ చేసేందుకు తనకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: CJI: సీజేఐగా తెలుగు వ్యక్తి... ఎంతో గర్వకారణమన్న తెలుగు కవులు