ETV Bharat / state

REVANTH REDDY: త్వరలో తెరాసలో ముసలం ఖాయం: రేవంత్‌ రెడ్డి

హుజూరాబాద్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను స్థానికేతరుడు అనడంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తీవ్ర అభ్యంతర వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావులు తమ నియోజకవర్గాలకు అనామకులే అని విమర్శించారు. బల్మూరి వెంకట్‌ స్థానికేతరుడు అని చేసిన కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు.

REVANTH REDDY: త్వరలో తెరాసలో ముసలం ఖాయం: రేవంత్‌ రెడ్డి
REVANTH REDDY: త్వరలో తెరాసలో ముసలం ఖాయం: రేవంత్‌ రెడ్డి
author img

By

Published : Oct 24, 2021, 12:14 PM IST

హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూర్‌ వెంకట్‌ను స్థానికేతరుడు అనడంపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్‌ రావులూ తమ నియోజకవర్గాలకు అనామకులేనని విమర్శించారు. ఉపఎన్నికలో పోలీసులనూ నిజాయతీగా విధులు నిర్వహించకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. భయపెట్టి ఓట్లు పొందేందుకు హరీశ్‌రావు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. బల్మూరి వెంకట్‌ స్థానికేతరుడు అని చేసిన కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై రేవంత్‌రెడ్డి కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడారు.

ఉద్యమాల గడ్డ తెలంగాణను తెరాస సర్కారు తాగుబోతులకు అడ్డాగా మార్చిందని రేవంత్​ రెడ్డి ఆరోపించారు. తెరాస, భాజపాలు రాష్ట్ర పరువును దిగజారుస్తున్నాయని ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పెట్రోలు, డీజిల్​ ధరలు అడ్డగోలుగా పెంచారని మండిపడ్డారు. భాజపా, తెరాసకు ప్రజలు ఎందుకు ఓటెయ్యాలో ఆలోచించాలన్నారు. పంపకాల్లో తేడాతోనే హుజూరాబాద్‌ ఉపఎన్నిక వచ్చిందని రేవంత్​ అన్నారు. దళిత బంధు, పేదల ఇళ్ల కోసం ఈటల రాజీనామా చేయలేదని ఆయన పేర్కొన్నారు. అభ్యర్థులు లోకల్, నాన్ లోకల్ అంటున్నారన్న రేవంత్​.. సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటలో పోటీచేసిన వాళ్లు స్థానికులా? అంటూ ప్రశ్నించారు. దుబ్బాక, హుజూర్‌నగర్, సాగర్‌లో ఇచ్చిన హామీలేమయ్యాయని రేవంత్​ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

రాష్ట్ర పోలీసు విభాగం రెండు భాగాలుగా విడిపోయిందని రేవంత్​ ఆరోపించారు. డీజీపీ ఫోన్‌ కూడా ట్యాప్‌ అవుతోందని పేర్కొన్నారు. నర్సింగరావు డీజీపీపై.. వేణుగోపాల్‌రావు తమపై నిఘా పెట్టారని రేవంత్‌ రెడ్డి అన్నారు. ప్రవీణ్‌కుమార్‌ వేరే పార్టీలో చేరారని.. ఆయన సామాజికవర్గ అధికారులను వేధిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబంలో ఆత్మత్యాగాలెవరు చేశారని రేవంత్‌ ప్రశ్నించారు. త్వరలో తెరాసలో ముసలం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.

వాస్తవంగా నియోజకవర్గంలో ఉన్న ఏ ఒక్క సమస్యపై కూడా చర్చ జరగలేదు. ఇద్దరు వ్యక్తులు, రెండు పార్టీలు పోటాపోటీగా కేవలం ఎన్నికలు, ఫిరాయింపులు, కొనుగోళ్లు, వ్యసనాలు, తాగుబోతులకు అడ్డాగా మార్చి తెరాస, భాజపాలు తెలంగాణ సంస్కృతిని చిన్నాభిన్నం చేసి తెలంగాణ సమాజాన్ని ప్రపంచం ముందు దోషిగా నిలబెట్టారు. కాంగ్రెస్​ అభ్యర్థి బల్మూరి వెంకట్​ను కేటీఆర్​ అనామకుడు అంటున్నడు. కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్‌ రావులూ తమ నియోజకవర్గాలకు అనామకులే. ప్రజలు మీకు అవకాశం ఇచ్చారు కాబట్టి మీరు విర్రవీగుతున్నరు.

-రేవంత్​ రెడ్డి, టీపీసీసీ చీఫ్​

త్వరలో తెరాసలో ముసలం ఖాయం: రేవంత్‌ రెడ్డి

ఇదీ చదవండి:

Huzurabad by election 2021: గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్థుల ధీమా.. ఎవరు ఏమంటున్నారంటే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.