ETV Bharat / state

ఓ ఇంటిపై పడిన పిడుగు... భయాందోళనకు గురైన స్థానికులు - karimnagar district news

ఓ ఇంటిపై పిడుగుపడిన ఘటన కరీంనగర్​లోని శ్రీరాంనగర్​లో చోటుచేసుకుంది. అర్ధరాత్రి తర్వాత సమీపంలోనే పిడుగులు పడినట్లు శబ్ధం వచ్చిందని... తమ ఇంటిపైనే పిడుగు పడిందని తాము అనుకోలేదని ఇంటి యజమాని నరేష్​రెడ్డి తెలిపారు.

thunderbolt on house in karimnagar
ఓ ఇంటిపై పడిన పిడుగు... భయాందోళనకు గురైన స్థానికులు
author img

By

Published : May 30, 2020, 6:05 PM IST

కరీంనగర్‌లో ఒక ఇంటిపై తెల్లవారుజామున పిడుగు పడటంతో ఇంటి యజమాని నరేష్‌రెడ్డి భయాందోళనకు గురయ్యారు. అర్ధరాత్రి ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో నగర ప్రజలు భయాందోళనకు గురయ్యారు.అర్ధరాత్రి తర్వాత సమీపంలోనే పిడుగులు పడినట్లు శబ్దం రావడం వల్ల కంగారు పడిపోయారు.ఆతర్వాత భారీగా వర్షం కురిసింది.

ఎక్కడో పిడుగు పడి ఉంటుందని భావించామని.. తమ ఇంటిపైనే పిడుగు పడి ఉంటుందని తాము అనుకోలేదని శ్రీరాంనగర్‌కు చెందిన నరేష్‌రెడ్డి వాపోయారు.తెల్లవారుజామున పాలవ్యాపారితో పాటు ఇతరులు ఆశ్చర్యంగా చూస్తుండటం వల్ల తమ ఇంటిపైనే పడినట్లు తెలిసిందని నరేష్‌రెడ్డి చెప్పారు.ఇంటిపై భాగంలో ఎలివేషన్ మొత్తం దెబ్బతిన్నదని.. ఎలాంటి ప్రాణనష్టమైతే జరగలేదని ఆయన వివరించారు.

ఇవీ చూడండి: 'నా కూతురిని ఇంటికి చేర్చండి...ఇదే నా చివరి కోరిక'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.