కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని మూడు వేల వస్త్ర ఉత్పత్తిదారుల కుటుంబాల్లో భరోసా కల్పించేందుకు ప్రత్యేక బీమా శిబిరం ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర జౌళిశాఖ అధికారుల సమక్షంలో పవర్లూమ్ కార్మికుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
ప్రమాద, సహజ మరణాలకు ఉచిత బీమా కల్పిస్తుండటం వల్ల మంచి స్పందన లభించింది. కార్మికుల వేతనాల నుంచి 8 శాతం, కేంద్ర ప్రభుత్వం నుంచి అంతే మెుత్తం సమీకరించి త్రిఫ్ట్ నిధి ఏర్పాటు చేశారు.
చేనేత కార్మికులకు మరిన్ని సంక్షేమ పథకాలు అందే విధంగా చర్యలు తీసుకుంటామని జౌళిశాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి: పరీక్షలు రాసిన చేతులే... పిడికిళ్లు బిగించాయి