శాశ్వత షెడ్లు ఏర్పాటు చేయకపోవడంతో చొప్పదండిలో వారసంతను రోడ్లకు ఇరువైపులే నిర్వహిస్తున్నారు. పట్టణానికి సమీపంలోని నాలుగు మండలాల ప్రజలు.. ప్రతి వారం ఇక్కడికి వస్తుంటారు. అసౌకర్యాలతో వ్యాపారస్థులు, కొనుగోలుదారులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నియోజకవర్గ కేంద్రం కావడం, అక్కడే ప్రభుత్వ కార్యాలయాన్ని ఉండటం వల్ల.. సంత నిర్వహించే రోజున ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడుతోంది.
కనీస ఏర్పాట్లు లేక తీవ్ర అవస్థలు పడుతున్నామని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అన్ని ఇబ్బందులు పడుతూ కూడా వేరే చోటు లేక అక్కడే సంత నిర్వహించాల్సి వస్తోందని చిరు వ్యాపారులు వాపోతున్నారు. పట్టణ శివారులోని ప్రభుత్వ భూముల్లో.. షెడ్లు నిర్మించి తమ సమస్యలను తీర్చాలని వ్యాపారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: నగరపాలక, పుర ఎన్నికలు వాయిదా కోరుతూ హైకోర్టులో పిటిషన్