రెడ్డి సామాజిక వర్గం కోసం పాటుపడిన రాజ బహదూర్ వెంకటరామ రెడ్డి విగ్రహాన్ని కరీంనగర్లో మంత్రి ఈటల రాజేందర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆవిష్కరించారు. పేరుకు రెడ్డి వసతి గృహం, కళాశాల అయినప్పటికి అన్ని వర్గాలను చేర్చుకుని ఆదరించిన ఘనత వారిదేనని మంత్రి కొనియాడారు. ఆయన సేవల్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం రెడ్డిల వసతి గృహాల కోసం విలువైన భూములను ఇచ్చిందని పేర్కొన్నారు. వారి సంక్షేమ కోసం ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని వెల్లడించారు. విగ్రహావిష్కరణ వల్ల ఒక గంట పాటు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి.
ఇదీచూడండి:'ఈ విజయం మాకు అంతులేని ఆనందం'