ETV Bharat / state

ఇంట్లో ఉంటూనే ఈజీగా 10 వేల అడుగులు! - మీరు డైలీ చేసే పనుల్లో ఈ చిన్న టిప్స్ యాడ్ చేస్తే చాలు - PLAN TO COMPLETE WALKING EVERY DAY

రోజూ 10 వేల అడుగుల టార్గెట్​ను రీచ్​ అవ్వడానికి సింపుల్ టిప్స్​ - ఈ చిన్న మిస్టేక్స్​ చేయకుండా ఉంటే సింపుల్​గా కంప్లీట్​ చేయొచ్చు

Plan To Complete Walking Every Day
Plan To Complete Walking Every Day (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 18, 2024, 1:48 PM IST

Plan To Complete Walking Every Day : ఫిట్​గా ఉండేందుకు చాలా మంది ఎన్ని అడుగులు వేయాలా అని ఆలోచిస్తూ లెక్కలు వేస్తుంటారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల బయటకు వెళ్లేందుకు సమయం కుదరకపోవచ్చు. అలాంటి వారు ఈ సింపుల్ ట్రిక్స్ పాటిస్తూ వాకింగ్​ను పూర్తి చేసేలా ప్లాన్​ చేసుకోండి.

  1. ఇంటిని క్లీన్ చేయడం, దుస్తులను ఉతకడం లాంటివి వ్యాయామం లాగానే ఉపయోగపడతాయి. మీకు తెలియకుండానే ఆ సమయంలో వాకింగ్ కూడా అయిపోతుంది. ఆ అడుగులు ఎన్నో తెలియాలంటే స్మార్ట్​వాచ్​ను ఉపయోగించవచ్చు.
  2. కొంతమంది ఫోన్​ మాట్లాడుతున్నప్పుడు ఒకే చోట అలా కూర్చుని ఉంటారు. అలా కాకుండా అటూ ఇటూ తిరుగుతూ, ఏదో ఒక పనిని చేసుకుంటూ ఫోన్​ మాట్లాడినట్లయితే పనులూ పూర్తవుతాయి. శరీరానికి వ్యాయామం కూడా అవుతుంది.
  3. కొన్ని గంటల తరబడి టీవీని చూస్తూ కూర్చుంటారు కొంతమంది. విరామం వచ్చినప్పుడో లేదా మధ్యలో అటూ ఇటూ తిరుగుతూ ఉండటం ఉత్తమం. దీనివల్ల పెద్దగా కష్టం తెలియకుండానే ఎక్సర్​సైజ్​ అవుతుంది.
  4. మీ దినచర్యలో రోజుకు కనీసం ఓ 20 నిమిషాలు వెచ్చించి ట్రెడ్​మిల్​పై వాకింగ్ చేయడం వల్ల పూర్తి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. శరీరం క్రమంగా ఫిట్​గా మారుతుంది.
  5. కూరగాయలు కట్​ చేయడం, టేబుల్​ టాప్​ను క్లీన్​ చేయడం లాంటి పనులు చేస్తున్నప్పుడు ఒకే చోట కుదురుగా ఉండేలా చేయకుండా సాంగ్స్​ను జోడించి అటూ ఇటూ తిరుగుతూ మధ్యలో చిన్న చిన్న స్టెప్పులేస్తూ ఉండటం ఉత్తమం. దీని వల్ల శరీరానికి వ్యాయామం అవుతుంది.
  6. మీరు పని చేసే చోట (ఆఫీస్​లో) గంటల తరబడి ఒకే చోట అలా కూర్చోకుండా మధ్యలో విరామం తీసుకుంటూ అప్పుడప్పుడూ ఓ నాలుగు అడుగులు వేస్తూ ఉండటం బెటర్. లేదంటే నెక్​పెయిన్, నడుము నొప్పి లాంటి సమస్యలు వస్తాయి.
  7. మీరు ఎన్ని అడుగులు వేశారో, ఎన్ని కిలోమీటర్ల దూరం నడిచారో అనే విషయాన్ని ఫిట్​నెస్ యాప్​ల ద్వారా తెలుసుకోవచ్చు. దీని వల్ల మరింత ఉత్సాహంగా కొనసాగిస్తారు.

ట్రెడ్​​మిల్​ వాకింగ్ మంచిది కాదా? - నిపుణులు ఏమంటున్నారో తెలుసా? - Outdoors Vs Treadmill Walking

మీ వయసు ప్రకారం రోజుకు ఎంతసేపు వాకింగ్ చేయాలో తెలుసా? నడకతో ప్రయోజనాలు తెలిస్తే షాక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.