అతివేగం బలి తీసుకుంటున్నా.. వాహనాల వేగం మాత్రం తగ్గడం లేదు. వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్తున్న కారు అతి వేగంతో గట్టు దుద్దెనపల్లి వద్ద బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు హుటాహుటిన క్షతగాత్రులను 108 ద్వారా కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి : వెంటాడుతున్న కబ్జాదారులు.. పోలీసులే న్యాయం చేయాలి!