తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. వేడుకల్లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల కార్యక్రమాన్ని తొందరగా ముగించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా తాడిపత్రితో పందిళ్లను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించారు.
ఇవీ చూడండి : కాంగ్రెస్, తెరాస కార్యకర్తల నినాదాలు... స్వల్ప ఉద్రిక్తత