ETV Bharat / state

government schools: 'పాఠ్య పుస్తకాలు రాక.. చదువులు ముందుకు సాగక' - no supply books latest news

government schools: ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమై పదిరోడులు గడుస్తున్నా విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు అందలేదు. పుస్తకాల ముద్రణ, సరఫరాలో జాప్యం వల్ల పిల్లలు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి ఆంగ్లమాధ్యమం ప్రారంభిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. పుస్తకాలు సకాలంలో పిల్లలకు చేతికి అందకపోవడంతో వారికి నిరాశే మిగులుతోంది.

పాఠ్య పుస్తకాలు
పాఠ్య పుస్తకాలు
author img

By

Published : Jun 24, 2022, 12:52 PM IST

పాఠ్య పుస్తకాలు రాక ..చదువులు ముందుకు సాగక

government schools: రాష్ట్రవ్యాప్తంగా సర్కారీ బడుల్లో ఇంకా పాఠ్య పుస్తకాలు పంపిణీకి నోచుకోలేదు. ఏటా మూణ్నెళ్లు ముందుగానే పుస్తకాలు జిల్లా కేంద్రాల్లోని గోదాములకు చేరేవి. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ముద్రణ, సరఫరా విషయంలో ఇంకా స్పష్టత రాలేదని ఉపాధ్యాయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల అలసత్వం వల్ల పాఠశాలలు ప్రారంభమయ్యే రోజున విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూపదుస్తులు అందించలేదకపోయారు.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా సుమారు 5 లక్షల 82 వేల పాఠ్యపుస్తకాలు అవసరమవుతాయన్న అంచనాతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. పుస్తకాల ముద్రణ పూర్తికాకపోవడం వల్ల ఇంకా పుస్తకాలు గోదాముల్లోకి చేరుకోలేదని విద్యాశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈసారి తెలుగు, ఆంగ్ల మాధ్యమాలున్నందున అందుకు తగ్గట్లు ఒకే పుస్తకంలో ఆంగ్లం, తెలుగు పాఠ్యాంశాలు ముద్రిస్తామని స్పష్టం చేసింది.

కరోనా కారణంగా గతేడాది అరకొరగానే పుస్తకాలు అందించారు. ఈ ఏడు ఇప్పటి వరకు కొత్త పుస్తకాలు రాకపోవడం వల్ల పాత వాటితోనే బోధన సాగిస్తున్నారు. కొత్త పుస్తకాలు వచ్చే వరకు తెలుగులోనే పాఠాలు చెప్పాల్సి ఉంటుందని టీచర్లు అభిప్రాయపడుతున్నారు. పుస్తకాల సరఫరాలో జాప్యంతో ఆంగ్ల మాధ్యమ బోధనపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికైనా విద్యాశాఖాధికారులు సత్వరం స్పందించి పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు త్వరగా అందజేయాలని విద్యార్థులు...వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.

"కరోనా కారణంగా గతేడాది అరకొరగానే పుస్తకాలు అందించారు. ఈ ఏడు ఇప్పటి వరకు కొత్త పుస్తకాలు రాకపోవడం వల్ల పాత వాటితోనే బోధన సాగిస్తున్నాం. కొత్త పుస్తకాలు వచ్చే వరకు తెలుగులోనే పాఠాలు చెప్పాల్సి ఉంటుంది" -టీచర్లు

"పుస్తకాలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. మాకు కొత్త పుస్తకాలు తొందరగా ఇవ్వాలని కోరుతున్నాం. ఇప్పటికైనా విద్యాశాఖాధికారులు సత్వరం స్పందించి పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు త్వరగా అందజేయాలి." -విద్యార్థులు

ఇదీ చదవండి: ఓటుకు నోటే కాదు.. ఓటరు కార్డు కావాలన్నా నోటుకు పని చెప్పాల్సిందే..!

Gujarat riots 2002: మోదీకి క్లీన్​ చిట్​ను సమర్థించిన సుప్రీంకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.