కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణం జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి రాష్ట్ర ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ పూలమాల వేశారు. అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఆరేళ్లు పూర్తైన సందర్భంగా హుజూరాబాద్‌లోని మంత్రి కార్యాలయంలో మంత్రి ఈటల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నూతనంగా కొనుగోలు చేసిన ట్రాలీ ఆటోలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ నిర్మల, తెరాస రాష్ట్ర సహాయ కార్యదర్శి బండ శ్రీనివాస్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
- ఇదీ చదవండి: స్వరాష్ట్రంలో సిక్సర్ కొట్టిన కేసీఆర్