తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు కరీంనగర్లో వామపక్ష పార్టీలు, ఏబీవీపీ కార్యకర్తలు మద్దతు తెలిపాయి. జిల్లా కేంద్రంలోని టవర్ సర్కిల్లో వ్యాపార వాణిజ్య సముదాయాలను సీపీఐ, సీపీఎం కార్యకర్తలు మూసివేయించారు. అనంతరం వారంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. పోలీసులు అడ్డుకుని ఆందోళనకారులను అరెస్ట్ చేసి జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రానికి తరలించారు.
ఇదీ చదవండిః కోదండరాం, ఎల్.రమణ అరెస్ట్..