ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఈ మేరకు కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. 42 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ చేయాలని, బకాయి ఉన్న డీఏలను విడుదల చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
పెన్షనర్ల న్యాయమైన హక్కులకోసం చేపడుతున్న నిరసన ప్రదర్శనలు ప్రభుత్వం గ్రహించి వెంటనే సమస్యలు పరిష్కరించాలని అసోసియేషన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: కలెక్టర్ ఎదుటే రైతు ఆత్మహత్యాయత్నం