ETV Bharat / state

దీక్ష కొనసాగిస్తున్న బండి సంజయ్​.. ప్రగతిభవన్​ వద్ద భారీగా బలగాలు - దుబ్బాక ఉపఎన్నికల వార్తలు

సిద్దిపేట సీపీ జోయల్​ డేవిస్​ను సస్పెండ్​ చేయాలని డిమాండ్​ చేస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ చేస్తున్న దీక్ష కొనసాగుతోంది. దుబ్బాకలో సోమవారం జరిగిన పరిణామాలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ప్రగతిభవన్​ను ముట్టడించే అవకాశం ఉందన్న ఉహాగానాల నేపథ్యంలో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్సీ రాంచందర్​రావును గృహనిర్బంధం చేశారు. పలువురు భాజపా నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

BJP LEADERS HOUSE ARREST
దీక్ష కొనసాగిస్తున్న బండి సంజయ్​.. ప్రగతిభవన్​ వద్ద భారీగా బలగాలు
author img

By

Published : Oct 27, 2020, 9:47 AM IST

Updated : Oct 27, 2020, 10:24 AM IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ దీక్షను కొనసాగిస్తున్నారు. సిద్దిపేట సీపీని సస్పెండ్ చేసి, కేసు నమోదుచేయాలన్న డిమాండ్​తో.. కరీంనగర్​లోని ఎంపీ కార్యాలయంలోనే నిరసన కొనసాగిస్తున్నారు. సీపీని సస్పెండ్‌ చేసే వరకూ దీక్ష విరమించబోనని సంజయ్‌ స్పష్టం చేశారు.

సోమవారం.. దుబ్బాక భాజపా అభ్యర్థి రఘునందన్​రావు బంధువుల ఇంట్లో సోదాలు జరిగాయి. పరామర్శించేందుకు దుబ్బాక బయలుదేరిన బండి సంజయ్​ను.. సిద్దిపేట శివార్లలోనే పోలీసులు అరెస్ట్​ చేశారు. తనను అరెస్ట్‌ చేసే క్రమంలో సిద్దిపేట సీపీ జోయల్‌ డేవిస్‌... చేయి చేసుకున్నారని సంజయ్‌ ఆరోపించారు. పార్లమెంట్​ సభ్యుడు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడినని చూడకుండా దురుసుగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. జోయల్‌ డేవిస్‌పై చర్యలు తీసుకోవాలంటూ దీక్షకు దిగారు​.

భాజపా శ్రేణులు ప్రగతి భవన్​ ముట్టడించే అవకాశం ఉందన్న ఊహాగానాల నేపథ్యంలో ఎమ్మెల్సీ రాంచందర్​రావు, డీకే అరుణ, ఇతర నేతల ఇళ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. వారు బయటకు రాకుండా గృహ నిర్బంధం చేశారు. పోలీసుల ఆంక్షలపై ఎమ్మెల్సీ రాంచందర్​రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతిభవన్​ వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు.

దీక్ష కొనసాగిస్తున్న బండి సంజయ్​.. ప్రగతిభవన్​ వద్ద భారీగా బలగాలు

ఇవీచూడండి: దుబ్బాకలో వేడెక్కిన రాజకీయం... రణరంగంగా సిద్దిపేట

నగదు దొరికినా నాటకాలేంటి: హరీశ్​రావు

Last Updated : Oct 27, 2020, 10:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.