ఉద్యోగ సంఘాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కరీంనగర్లో డీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాలు నిరసన చేపట్టాయి. పదోతరగతి మూల్యాంకన సెంటర్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వేసవి సెలవులు మంజూరు చేయాలని.. వాల్యుయేషన్ రేట్లు పెంచాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సమస్యలు పరిష్కరిస్తారనుకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని మండిపడ్డారు. కేసీఆర్ సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి.
ఇవీ చూడండి: మొదట ఎంపీటీసీ ఓటు.. తర్వాతే జడ్పీటీసీ...!