కరీంనగర్ జిల్లాలో ప్రారంభమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జి అంబటి జోజిరెడ్డి పర్యవేక్షించారు. పని కల్పించిన ప్రదేశాల్లో కూలీలకు తగిన సౌకర్యాలు కల్పించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు.
కూలీలకు సరైన వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లాక్డౌన్ కొనసాగుతున్నందున కూలీలకు 15 రోజుల అడ్వాన్స్ చెల్లించి ఆదుకోవాలని కోరారు.