కరీంనగర్లోని ఫతేపురా, గోదాంగడ్డ ప్రాంతాల్లో అక్రమంగా హలీం, హారీస్లను తయారు చేస్తున్న కేంద్రాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఫతేపురాలో సయ్యద్ ఖదీర్, అతని కుమారులు ముదస్సర్, అబ్రత్కా వలి లను, గోదాంగడ్డలో షేక్ ఫరీద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాడుల్లో టాస్క్ ఫోర్స్ విభాగం ఇన్స్పెక్టర్లు ఆర్ ప్రకాశ్, శశిధర్ రెడ్డి, ఏఆర్ఎస్ఐ నరసయ్యలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు.
ఫతేపురాలో ముగ్గురు...
ఫతేపురాలో సయ్యద్ ఖదీర్, అతని కుమారులు రహస్యంగా హారీస్ తయారు చేయడమే కాకుండా... ఫోన్ల ద్వారా ఆర్డర్లు తీసుకుని డోర్ డెలివరీ చేస్తున్నారు. పక్కా సమాచారంతో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేసి వీరి వద్ద నుంచి 75 కిలోల మాంసం, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. వారిపై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
గోదాంగడ్డలో ఒకరు...
మరో వైపు గోదాంగడ్డ ప్రాంతంలోని ఓ ఫంక్షన్ హాల్ వెనుక భాగంలోని హలీం తయారీ కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. తయారీదారుడు షేక్ ఫరీద్ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.