కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ మంగపేట గ్రామపంచాయతీల నూతన భవనాలకు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ భూమి పూజ చేశారు. అలాగే మున్నూరుకాపు సంఘ భవనాల నిర్మాణాలకు భూమి పూజ నిర్వహిచారు.
పల్లెల అభివృద్ధే ధ్యేయంగా తెరాస ప్రభుత్వం పని చేస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం దీని కోసం పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తుందని తెలిపారు. మిషన్ భగీరథ పథకంతో అన్ని గ్రామాలకు త్వరలో తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు. ఈ పథకంతో ఇప్పటికే చెరువులు నిండి గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొందన్నారు.
ఇదీ చూడండి: కోలుకున్నాక 8 నెలల వరకు బేఫికర్!