కాళేశ్వరం ప్రాజెక్టులోని గాయత్రి పంపుహౌస్‌లో నాలుగో పంపు వెట్‌రన్ విజయవంతమైంది. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద గల గాయత్రి పంపుహౌస్‌లో ఆగస్టు 11న మొదటి పంపు వెట్‌రన్ నిర్వహించారు. అనంతరం మరో రెండు పంపులను పరీక్షించారు. అప్పటి నుంచి నిరాటంకంగా గోదావరి జలాలు రాజరాజేశ్వర జలాశయానికి తరలిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 12 టీఎంసీల నీటిని రాజరాజేశ్వర జలాశయానికి తరలించారు. తాజాగా మరో పంపు వెట్‌రన్ పూర్తి కావటం వల్ల 12 వేల క్యూసెక్కులకు పైగా నీటిని తరలించే ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఇదీ చూడండి:- తప్పతాగి తప్పుడు పనికి యత్నిస్తే ఉతికారేశారు!