కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశ్రాజపల్లిలో ఓ అరుదైన పురాతన విగ్రహం బయటపడింది. భూమి చదును చేస్తుండగా శ్రీవల్లి, దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం వెలుగు చూసింది. పురాతన కాలం నాటి అరుదైన విగ్రహం కావటంతో స్థానికులుపెద్ద సంఖ్యలో వచ్చి పూజలు చేస్తున్నారు.
శ్రీ వల్లి, దేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి విగ్రహం ఈ ప్రాంతంలోనే అరుదైనదిగా వారు చెబుతున్నారు. ఈ విగ్రహం పురాతన శిల్పకళకు నిదర్శనమని పండితులు తెలిపారు.
ఇదీ చదవండి: వలకు చిక్కిన కొండచిలువ... ఉలిక్కి పడ్డ మత్స్యకారుడు