కరీంనగర్ జిల్లాలో చిల్లర రాజకీయాలు చేస్తూ ప్రజల ప్రాణాలను పట్టించుకోవటంలేదని స్థానిక సంస్థల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు బోళ్ల కరుణాకర్ మండిపడ్డారు. హుజూరాబాద్‌లో ఆయన సమావేశం నిర్వహించి ప్రసంగించారు.
మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఉద్యమ నాయకుడని బోళ్ల కరుణాకర్ పేర్కొన్నారు. ఈటల వైద్యారోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 24 గంటల పాటు ప్రజలకు సేవలను అందించారన్నారు. ఒక బలమైన శక్తిగా ఈటల ఎదుగుతున్నాడని గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించిన ఘనత ఈటలదేనన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులని.. రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటలు విని ప్రజలు మారబోరని స్పష్టం చేశారు. కార్యకర్తలూ ఈటల వైపే ఉంటారన్నారు. ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా ప్రజలు, నాయకులు ఈటల వెంటే ఉంటారని వెల్లడించారు. కొవిడ్‌తో అనేక మంది చనిపోతున్నారని, ఆసుపత్రుల్లో కనీస వసతులు కరవయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడం మాని.. కరోనా నివారణ చర్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఇదీ చూడండి: బేగంపేట వద్ద ఎంపీ రేవంత్‌రెడ్డిని అడ్డుకున్న పోలీసులు