కరీంనగర్ సిటీ ఫోటో, వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఫోటో వర్క్‌షాప్ నిర్వహించనున్నారు. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కరీంనగర్ జిల్లా ముద్దసాని గ్రామంలో నిర్వహిస్తున్నట్లు సంస్థ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ పెద్ద మొత్తంలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. దూర ప్రాంతాల్లో నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌కు వెళ్లని వారికి ఇదో మంచి అవకాశమన్నారు. దీన్ని ఔత్సాహికవేత్తలు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాకులు వెల్లడించారు.
ఇవీ చూడండి: పంచాయతీ రాజ్ చట్టంపై కేసీఆర్ దిశానిర్దేశం