ETV Bharat / state

మహిళలు రుణాలను సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి - కరీంనగర్‌ జిల్లా తాజా వార్తలు

ప్రభుత్వం అందిస్తున్న ప్రత్యేక రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలని... రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌లో సహారా సంస్థ ఆధ్వర్యంలో కుట్టు మిషన్‌ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు మేయర్ సునీల్‌రావుతో కలిసి సర్టిఫికెట్‌లను పంపిణీ చేశారు.

State BC Welfare Minister Gangula Kamalakar meeting in karimnagar district
రుణాలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి గంగుల
author img

By

Published : Jan 26, 2021, 6:11 PM IST

కుటుంబ బాధ్యత ఎక్కువగా మహిళలకే ఉంటుందని, అందుకే రాష్ట్రప్రభుత్వం తరుపున వారికి ప్రత్యేక రుణాలు అందిస్తున్నామని... బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కరీంనగర్‌లో సహారా సంస్థ ఆధ్వర్యంలో కుట్టు మిషన్‌ శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు‌ మేయర్ సునీల్‌రావుతో కలిసి సర్టిఫికెట్‌లను పంపిణీ చేశారు.

సహారా సంస్థ ద్వారా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్‌ శిక్షణ ఇప్పించడం అభినందనీయమని మంత్రి కొనియాడారు. 4 సంవత్సరాలుగా ఎటువంటి లాభం ఆశించకుండా సంస్థ నిర్వాహకురాలు అస్మా... శిక్షణతో పాటు కుట్టు మిషన్‌లు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఆమె తన ఇంటినే శిక్షణ కేంద్రంగా మార్చారని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రారంభించారని అన్నారు. వాటిలో మహిళలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: స్వదేశీ టీకా మనకు గర్వకారణం: బాలకృష్ణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.